శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం

153చూసినవారు
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం
AP: తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, భక్తులు వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 78,445 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 40,098 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.3 కోట్లుగా నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్