30 వేల కోట్ల ఆస్తి వివాదంలో కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు

10343చూసినవారు
30 వేల కోట్ల ఆస్తి వివాదంలో కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ వ్యాపారవేత్త దివంగత సంజయ్ కపూర్ 30 వేల కోట్ల ఆస్తి వివాదం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. సంజయ్ రెండో భార్య పిల్లలు సమైరా, కియాన్‌లకు, మూడవ భార్య ప్రియా కపూర్‌కు మధ్య ఈ ఆస్తిపై న్యాయపోరాటం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కరిష్మా పిల్లలకు అనుకూలంగా కీలక ఆదేశాలు జారీ చేయడంతో, కరీనా కపూర్ సోషల్ మీడియాలో "న్యాయం, నిజం ఎప్పుడూ గెలుస్తాయి" అంటూ చేసిన పోస్ట్ చర్చ రేకెత్తించింది. ప్రియా కపూర్ వీలునామా ఫోర్జరీ చేశారని, ఆస్తులను దాచిపెట్టారని కరిష్మా పిల్లలు ఆరోపించారు. కోర్టు ప్రియా కపూర్‌పై మధ్యంతర స్టే విధించి, ఆస్తుల బదిలీని నిలిపివేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్