గత కొన్ని రోజులుగా ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలో తీవ్రమైన వడగాడ్పులు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. తాజా అధ్యయనం ప్రకారం, వడగాడ్పుల వల్ల ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా సుమారు 30,000 మంది మరణించారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే ఈ ఐదు రోజుల్లో 8,100 అదనపు మరణాలు సంభవించాయని పరిశోధకులు పీయూష్ నారంగ్, అశోక్ గాడ్గిల్ తెలిపారు.