
భయంకరమైన తుఫాన్.. అద్భుతమైన వీడియో!
కరీబియన్ దీవుల్లో భయంకరమైన విధ్వంసం సృష్టిస్తున్న హరికేన్ ‘మెలిస్సా’ అద్భుత దృశ్యాలను అమెరికా ఎయిర్ఫోర్స్ హరికేన్ హంటర్స్ బృందం చిత్రీకరించారు. ప్రమాదాన్ని లెక్కచేయకుండా విమానంలో తుఫాన్ మేఘాల మధ్య ప్రవేశించి వీడియోలు రికార్డు చేశారు. ఈ అద్భుత దృశ్యాన్ని ‘స్టేడియం ఎఫెక్ట్’గా వారు పేర్కొన్నారు. కాగా, మెలిస్సా నేడు(మంగళవారం) జమైకా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.




