AP: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు. ఉదయం 6.30 నుంచి 7 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు. విస్తృత కూంబింగ్‌లో ఆయుధాలతోపాటు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కృష్ణా, విజయవాడ, కాకినాడల్లో 31 మంది మావోయిస్టులను, అందులో 9 కేంద్ర కమిటీ సభ్యులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.