నేపాల్‌ వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతు: భారత విదేశాంగశాఖ

8చూసినవారు
నేపాల్‌ వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతు: భారత విదేశాంగశాఖ
నేపాల్‌లో భారీ వరదల కారణంగా వందలాది మంది భారతీయులు గల్లంతైనట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. 320 మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని, వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని పేర్కొంది. మరోవైపు చైనాలో చిక్కుకున్న సుమారు 400 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. నేపాల్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి అక్కడి ప్రభుత్వంతో సమన్వయం చేస్తున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్