ఇజ్రాయెల్తో సీజ్ఫైర్ ఒప్పందం తర్వాత గాజాలో హమాస్ నరమేధానికి పాల్పడింది. ఇజ్రాయెల్కు గూఢచారులుగా పనిచేస్తున్నారనే ఆరోపణలపై సుమారు 33 మంది పాలస్తీనియన్లను హమాస్ తుపాకులతో కాల్చి చంపింది. బహిరంగ ప్రదేశంలో మోకాళ్లపై కూర్చోబెట్టి మరణదండన విధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యుద్ధంతో బలహీనపడిన హమాస్, తమ ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజల్లో భయం నింపడానికి ఈ చర్యలకు పాల్పడుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.