ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (OFMK)లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 37 మేనేజర్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకీ దరఖాస్తు గడువు ఇవాళ ముగియనుంది. పోస్టును అనుసరించి డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం అవసరం. 18 నుంచి 30 ఏళ్ల వారు అర్హులు. నెలకు వేతనం రూ.23 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.