టర్కీలో 3వ శతాబ్దపు యేసు పెయింటింగ్ లభ్యం

0చూసినవారు
టర్కీలో 3వ శతాబ్దపు యేసు పెయింటింగ్ లభ్యం
టర్కీలోని ఇజ్నిక్ (పురాతన నైసియా) ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు 3వ శతాబ్దానికి చెందిన భూగర్భ సమాధిలో ఒక అరుదైన ఫ్రెస్కోను కనుగొన్నారు. ఈ చిత్రంలో యేసును గడ్డం లేకుండా, రోమన్ టోగా ధరించి, భుజంపై గొర్రెపిల్లను మోస్తున్న 'గుడ్ షెపర్డ్' (మంచి కాపరి)గా చూపించారు. ఆగస్టు నెలలో హిసార్డెరే నెక్రోపాలిస్‌లోని భూగర్భ సమాధిలో ఈ ఆవిష్కరణ జరిగింది. ఈ ఫ్రెస్కో లేట్ పాగనిజం నుంచి ప్రారంభ క్రైస్తవ మతానికి మారుతున్న కాలాన్ని సూచిస్తుందని, ఆ సమయంలో క్రైస్తవులు రోమన్ సామ్రాజ్యంలో హింసకు గురవుతున్నారని ఆర్కియాలజిస్టులు తెలిపారు.