
జమ్మూ కాశ్మీర్లో 'వందేమాతరం' తప్పనిసరి
జమ్మూ కాశ్మీర్ పాఠశాలల్లో 'వందేమాతరం' తప్పనిసరి చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ముస్లిం మత సంస్థల సమాఖ్య ముతాహిదా మజ్లిస్-ఎ-ఉలేమా (MMU) దీనిని వ్యతిరేకిస్తోంది. ఈ చర్యను 'బలవంతపు ఆదేశాలు'గా అభివర్ణిస్తూ, వందేమాతరం పాడటం ఇస్లాంకు విరుద్ధమని MMU నాయకుడు మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్ పేర్కొన్నారు. ఈ ఆదేశాలు సాంస్కృతిక వేడుక ముసుగులో హిందుత్వ భావజాలాన్ని రుద్దే ప్రయత్నమని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి.




