
హైదరాబాద్‌లో ముగ్గురు బాలికల అదృశ్యం.. పోలీసుల గాలంపు
TG: హైదరాబాద్ దోమలగూడలో ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిన స్నేహ, లలిత, లత అనే ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. వీరు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కుటుంబాల పిల్లలుగా గుర్తించారు. హిమాయత్‌నగర్‌లో ఆటో ఎక్కిన ఈ బాలికలు, కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద దిగినట్లు సీసీటీవీ విజువల్స్ ద్వారా నిర్ధారణ అయింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రత్యేక బృందాలతో బాలికల ఆచూకీ కోసం గాలిస్తున్నారు




