
రీ-మైగ్రేషన్.. బలవంతపు బహిష్కరణపై ఆందోళన
ప్రపంచీకరణతో వలసలు పెరిగాయి. అయితే, ఇప్పుడు ఐరోపా, ఇతర దేశాల్లో 'రీ-మైగ్రేషన్' అనే పదం కలకలం రేపుతోంది. ఇది స్వచ్ఛందంగా స్వదేశానికి తిరిగి రావడం కాదు, చట్టబద్ధంగా నివసిస్తున్న వారిని జాతి, మతం ఆధారంగా బలవంతంగా వెనక్కి పంపే ప్రక్రియ. దీనిని 'ఎథ్నిక్ క్లీన్సింగ్'కు దగ్గరగా ఉందని విమర్శిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి, అమ్నెస్టీ వంటి సంస్థలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, సంస్కృతి దెబ్బతింటుందనే భయంతో కొందరు రాజకీయ నాయకులు దీనిని ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఈ విధానం మానవ హక్కులను కాలరాస్తుందని, మైనార్టీలపై దాడులు పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.




