
ఆకాశంలో అద్భుతం: రేపు, ఎల్లుండి సూపర్ మూన్ దర్శనం
ఆకాశంలో రేపు (సోమవారం), ఎల్లుండి ఖగోళ అద్భుతం ఆవిష్కృతం కానుంది. చంద్రుడు సూపర్ మూన్ రూపంలో దర్శనమివ్వనున్నాడు. ఈ సమయంలో చంద్రుడు సాధారణ పౌర్ణమి కంటే 14% పెద్దగా, 30% ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. భూమికి అత్యంత సమీపంగా చంద్రుడు వచ్చినప్పుడు, పౌర్ణమి కూడా రావడంతో ఈ అద్భుత దృశ్యం ఏర్పడుతుంది. దీనిని 'హార్వెస్ట్ మూన్' అని కూడా పిలుస్తారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో మరో రెండు సూపర్ మూన్స్ రానున్నాయి.




