దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో 4192 కేసులు

29చూసినవారు
దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో 4192 కేసులు
దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 4,192గా ఉన్నట్లు అమికస్‌ క్యూరీ అన్సారియా నివేదికలో వెల్లడించారు. ఈ కేసుల విచారణ పురోగతిపై ఆయన సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు. 2025 నాటికి 1,243 కేసుల విచారణ పూర్తయినట్లు తెలిపారు. అదే ఏడాది ప్రజాప్రతినిధులపై కొత్తగా 1,050 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. కాగా, ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు, పర్యవేక్షణ అవసరమని గతంలో సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్