
అజిత్ కుమార్ అంత్యక్రియల్లో దొంగల చేతివాటం.. రూ.30 లక్షల ఆభరణాల చోరీ
దివంగత మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ కుమార్ అంత్యక్రియల్లో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. అంతిమ సంస్కారాలకు హాజరైన వారి నుంచి బంగారు చైన్లను దొంగిలించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి దాదాపు రూ. 30 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.




