వడదెబ్బతో ఒక్కరోజే 45 మంది మృతి!

13చూసినవారు
వడదెబ్బతో ఒక్కరోజే 45 మంది మృతి!
TG: రాష్ట్రంలో భానుడు భగ్గుమంటున్నాడు. తీవ్రమైన వడగాలుల కారణంగా రాష్ట్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వడదెబ్బకు గురై మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 45 మంది మృతి చెందినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఉమ్మడి KMM జిల్లాలో అత్యధికంగా 17 మంది, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 16 మంది మృతి చెందారు. అలాగే ఉమ్మడి ADLBలో ఐదుగురు, ఉమ్మడి కరీంనగర్‌లో నలుగురు, ఉమ్మడి నల్గొండలో ఇద్దరు, ఉమ్మడి MBNR జిల్లాలో ఒకరు వడదెబ్బ కారణంగా మరణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్