10 ఏళ్ల మైనర్ బాలికపై 45 ఏళ్ల‌ వ్యక్తి అఘాయిత్యం

90చూసినవారు
10 ఏళ్ల మైనర్ బాలికపై 45 ఏళ్ల‌ వ్యక్తి అఘాయిత్యం
AP: తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో 10 ఏళ్ల మైనర్ బాలికపై 45 ఏళ్ల చీరల రమేష్ నాయుడు అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఇంటి బయట ఆడుకుంటున్న 5వ తరగతి చదువుతున్న బాలికను ఆటోలో రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి, ఊరి బయటకు తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేశాడు. సోమవారం జరిగిన ఈ దారుణాన్ని బాధితురాలు మరుసటి రోజు తల్లికి చెప్పడంతో కుటుంబ సభ్యులు రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్