తెలంగాణ ఆర్టీసీలో 4,538 ఉద్యోగాల భర్తీ.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

25చూసినవారు
తెలంగాణ ఆర్టీసీలో 4,538 ఉద్యోగాల భర్తీ.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో 4,538 ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. సిబ్బంది కొరతను అధిగమించి ఉద్యోగులపై పనిభారం తగ్గించేందుకు ఈ నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందుతున్నాయని చెప్పారు. 2017 పీఆర్‌సీ, డీఏ బకాయిలతో పాటు 2013 నుంచి పెండింగ్‌లో ఉన్న బాండ్లను క్లియర్‌ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్