48 ఏళ్ల సినీ ప్రయాణం.. చిరు భావోద్వేగ పోస్ట్‌

5చూసినవారు
48 ఏళ్ల సినీ ప్రయాణం.. చిరు భావోద్వేగ పోస్ట్‌
అగ్ర కథానాయకుడు చిరంజీవి తన సినీ ప్రస్థానం మొదలై 48 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. 22 సెప్టెంబర్ 1978న శివశంకర వరప్రసాద్ నుంచి ‘చిరంజీవి’గా మారిన తన పేరు, నేడు తనకు శాశ్వత గుర్తింపుగా నిలిచిందని తెలిపారు. ఆయన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’ అయినప్పటికీ, ముందుగా విడుదలైన ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో 48 ఏళ్ల క్రితం ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సహకరించిన ప్రతి నిర్మాత, దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా తనపై అపారమైన ప్రేమను చూపిన అభిమానులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్