
పైరసీ ఓ బిగ్ ట్రాప్: నాగార్జున (వీడియో)
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ పైరసీ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను కలిశారు. నటుడు అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, ఐబొమ్మతో సినిమా పైరసీ కేవలం రూ.20 కోట్ల కోసం చేసిన పని కాదని, దీని వెనుక అంతర్జాతీయ రాకెట్, మోసం ఉందని తెలిపారు. క్రెడిట్ కార్డ్ వివరాలతో పాటు అన్ని వివరాలు సేకరిస్తారని, పైరసీలో సినిమాలు చూపించడం ఒక బిగ్ ట్రాప్ అని నాగార్జున వెల్లడించారు.




