ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన శ్రీనివాసులు డీఎస్సీలో ఐదు ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించారు. గణితం ఎస్‌ఏ, ఎస్‌ఏ ఫిజికల్‌సైన్స్, టీజీటీ గణితం, టీజీటీ ఫిజికల్ సైన్స్, టీజీటీ సైన్స్‌లను సొంతం చేసుకున్నాడు. చివరగా ఎస్‌ఏ గణితం ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నాడు. శ్రీనివాసులు 2018, 2019లో రైల్వే గ్రూప్-డీ ఉద్యోగాలు సాధించినా చేరలేదు. రాధాకృష్ణ మాస్టారు సాయంతో ఈ ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు.