ప్రాథమిక జీవన నైపుణ్యాలుగా ఇంటి పనులను మగపిల్లలకు కూడా నేర్పాలని నిపుణులు సూచిస్తున్నారు. వంట చేయడం, బట్టలు ఉతకడం, గది శుభ్రం చేయడం, సరుకుల లెక్కలు చూడటం వంటి పనులు నేర్పడం ద్వారా వారు స్వతంత్ర వ్యక్తులుగా ఎదుగుతారని, ఆర్థిక నిర్వహణ, భావోద్వేగ పరిపక్వత వంటి అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా ఎవరిపైనా ఆధారపడకుండా ఎదుగుతారని పేర్కొన్నారు. మారుతున్న సమాజంలో మగపిల్లలకు చిన్ననాటి నుంచే అన్ని పనులలో శిక్షణ ఇవ్వడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం, బాధ్యతారాహిత్యం పోయి పరిపక్వత పెరుగుతుందని నిపుణులు తెలిపారు.