డబ్బు, భూమి, బంగారం వంటి వాటిని ఆస్తులు (Assets)గా పరిగణిస్తారు. మీకు ఆదాయం తెచ్చే, విలువ పెరిగే వాటిని ఆస్తులు అంటారు. అయితే కారు, బైక్ లాంటివి ఆస్తులు కావు. మనం కొన్న కారు లేదా బైక్ విలువ భవిష్యత్తులో తగ్గిపోతుంది. బంగారంలో మీరు పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మీ సంపద పెరుగుతుంది. భూములు, ఇళ్లు, ఇళ్ల స్థలాల వల్ల కూడా ఆస్తి విలువ పెరుగుతుంది. ఇలా మీ ఆస్తి విలువ పెంచే వాటి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.