లద్దాఖ్‌కు కొత్తగా 5 జిల్లాలు

17చూసినవారు
లద్దాఖ్‌కు కొత్తగా 5 జిల్లాలు
కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం లెహ్, కార్గిల్ జిల్లాలు ఉన్న లద్దాఖ్‌లో, నుబ్రా, షామ్, చాంగ్‌థాంగ్, జన్‌స్కర్, ద్రాస్‌ అనే ఐదు కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య ఏడుకు చేరుకుంటుంది. ఈ నిర్ణయం పరిపాలనా సౌలభ్యాన్ని పెంచి, వృద్ధి, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని, పాలన ప్రజలకు చేరువవుతుందని ఎల్జీ తెలిపారు.

సంబంధిత పోస్ట్