
తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్కు సీఎం చంద్రబాబు ఆమోదం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తిరుపతిలో ఏపీ ఫస్ట్ (ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ) పేరుతో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ సెంటర్ను తిరుపతిలోని ఐఐటీ-ఐసర్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు. యువత భవిష్యత్తుకు మార్గం సుగమం చేసే పరిశోధనలు ఇక్కడ జరుగుతాయని సీఎం వెల్లడించారు.




