7 పరుగులకే 5 వికెట్లు

70చూసినవారు
7 పరుగులకే 5 వికెట్లు
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 2.4 ఓవర్లలోనే 7 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్‌లో భువనేశ్వర్‌ బౌలింగ్‌లో స్టబ్స్‌, అక్షర్‌పటేల్‌ ఔటయ్యారు. రెండో ఓవర్‌లో హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ (1), సమీర్‌ రిజ్వీ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. తొలి ఓవర్‌లో భువనేశ్వర్‌ బౌలింగ్‌లో సాహిల్‌ (0) ఔటయ్యాడు. మొత్తంగా భువనేశ్వర్‌ 3, హేజిల్‌వుడ్‌ 2 వికెట్లు తీశారు. నితీశ్‌ రాణా, అభిషేక్‌ పొరెల్‌ క్రీజులో ఉన్నారు.

ట్యాగ్స్ :