ఆ డాక్టర్లకు 50శాతం అదనపు ఇన్సెంటివ్!

3చూసినవారు
ఆ డాక్టర్లకు 50శాతం అదనపు ఇన్సెంటివ్!
TG: గిరిజన జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పని చేసే ప్రొఫెసర్లు, టీచింగ్ ఫ్యాకల్టీకి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుంది. వారి బేసిక్ పేలో 50% అదనపు ఇన్సెంటివ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రైబల్ ఏరియాకు వెళ్లేందుకు డాక్టర్లు ఇష్టపడట్లేదు. ఫలితంగా కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత ఏర్పడి గుర్తింపు కోల్పోయే ప్రమాదముంది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి, ఆసిఫాబాద్, MLG, MHBD, భూపాలపల్లి కాలేజీలు గిరిజన ప్రాంతాల పరిధిలోకి వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్