పార్టీ పరంగా BCలకు 50% రిజర్వేషన్లు.. ఖర్గే అనుమతి?

21682చూసినవారు
పార్టీ పరంగా BCలకు 50% రిజర్వేషన్లు.. ఖర్గే అనుమతి?
తెలంగాణలో స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 50% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లేందుకు AICC అధ్యక్షుడు ఖర్గే అనుమతి ఇచ్చినట్లు సమాచారం. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ ఢిల్లీలో ఖర్గేను కలిశారు. పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లపై ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చర్చ సాగుతోంది. 17న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్