AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భాష్యం స్కూల్ లో ఐదవ తరగతి చదువుతున్న రంజిత అనే విద్యార్థిని చున్నితో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురు చనిపోవడానికి టీచర్ వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. టీచర్ వేధింపుల కారణంగా విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదాన్ని, కలకలాన్ని సృష్టించింది.