
తుఫాన్ ఎఫెక్ట్.. రాత్రి 7 తరువాత హైవేలపై భారీ వాహనాలు నిలిపివేత
AP: మొంథా తుపాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత జిల్లాల్లో రహదారులపై కీలక ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 7 గంటల నుంచి జాతీయ రహదారులపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయాలని సూచించింది. వాహనాలను ముందుగానే సురక్షిత ప్రదేశాల్లో నిలపాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు రాత్రి ప్రయాణాలు చేయరాదని పేర్కొంది.




