ఏపీలో 60 మంది హిడ్మా బృందం ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌ఘడ్‌లో వరుస కూంబింగ్ ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో సేఫ్ జోన్ కోసం మావోయిస్టులు విజయవాడ వచ్చారు. 60 మంది హిడ్మా టీమ్ ఆంధ్రాలోకి ప్రవేశించినట్లు ఇంటలిజెన్స్ బ్యూరో గుర్తించింది. వారిలో కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు సమాచారం. వారంతా విజయవాడ, కాకినాడ , వైజాగ్, విజయనగరం వైపు బృందాలుగా డివైడ్ అయినట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే పోలీసులు 31 మంది మావోలను అరెస్ట్ చేశారు.