బిహార్‌లో 65 కి.మీ. ట్రాఫిక్‌ జామ్‌.. 4 రోజులుగా నిలిచిన వాహనాలు

32చూసినవారు
బిహార్‌ రోహ్‌తాస్‌ జిల్లాలో భారీ వర్షాల ప్రభావంతో ఢిల్లీ-కోల్‌కతా జాతీయ రహదారిపై 65 కి.మీ. మేర ట్రాఫిక్‌ స్తంభించింది. నాలుగు రోజులుగా లారీలు, బస్సులు, కార్లు, బైకులు రహదారిపైనే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క కిలోమీటర్‌కు గంటలు పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ-గురుగ్రామ్‌ రహదారిపై కూడా 10 కి.మీ. మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్