స్కూల్ బస్సు నుంచి కిందపడి 7 ఏళ్ల బాలిక మృతి

6చూసినవారు
AP: పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెంలో విద్యార్థులను తీసుకువెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఏడేళ్ల బాలిక యక్కంటి జశ్విత అక్కడికక్కడే మృతి చెందింది. పిడుగురాళ్లలోని ప్రైవేట్ పాఠశాల నుంచి అనుపాలెం వైపు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. బాలిక కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్