టర్కీలోని గ్రాండ్ కార్టెల్ హోటల్‌లో జనవరి 21న జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై అక్కడి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో 78 మంది ప్రాణాలు కోల్పోగా, 133 మంది గాయపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హోటల్ యజమాని హాలిత్ ఎర్గుల్, అతని కుటుంబ సభ్యులు, హోటల్ మేనేజర్లు, స్థానిక అధికారులు సహా మొత్తం 11 మందికి జీవిత ఖైదు విధించింది. పిల్లల మరణాలపై ప్రత్యేకంగా శిక్షలు విధించగా, అదనంగా 25 సంవత్సరాల జైలు శిక్షను కూడా ప్రకటించింది.