
కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిల మోత: హరీశ్‌రావు
TG: మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీది ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిల మోత అని ఎద్దేవా చేశారు. పంపకాల విషయంలో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని, క్యాబినెట్ సమావేశంలో బట్టలూడదీసుకుని తిట్టుకున్నారని పేర్కొన్నారు. ప్రజల గురించి కాకుండా, వాటాలు పంచుకోవడానికే కాంగ్రెస్‌కి టైం సరిపోతుందని మీడియా ఎదుట ఆదివారం విమర్శించారు.




