
ఇన్స్టాగ్రామ్ ప్రేమను ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య
AP: చిత్తూరు జిల్లా వి.కోట మండలం పట్రపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడిన శోభ(19) అతడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. దీనిపై కుటుంబ సభ్యులు మందలించడంతో మంగళవారం మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శోభ ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




