భారీ మొసలిని భుజాలపై మోసుకెళ్లిన వ్యక్తి (వీడియో)

8703చూసినవారు
రాజస్థాన్‌లోని కోట జిల్లా బంజారి గ్రామంలో శుక్రవారం రాత్రి 80 కిలోల భారీ మొసలి ఒక ఇంట్లోకి ప్రవేశించింది. కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీయగా, అధికారులు స్పందించకపోవడంతో వన్యప్రాణి సంరక్షకుడు హయత్ ఖాన్, అతని బృందం మొసలిని పట్టుకున్నారు. గంటపాటు శ్రమించి, మొసలి నోటికి టేపు వేసి బంధించి, అనంతరం దానిని చంబల్ నదిలో విడిచిపెట్టారు. ఈ గ్రామంలో ఏడాదిలో ఇలాంటి ఘటనలు మూడుసార్లు జరిగాయని, సమీపంలోని చెరువు నుండి మొసళ్లు వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు.