దేశవ్యాప్తంగా రైల్వే రీజియన్లలో 8,875 రైల్వే పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే శాఖ షార్ట్ నోటీస్ విడుదల చేసింది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కింద ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 5,817 గ్రాడ్యుయేట్ స్థాయి, 3,058 అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ స్థాయిలో గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, స్టేషన్ మాస్టర్ వంటి పోస్టులు ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ వంటి పోస్టులు ఉన్నాయి. దీని నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.