మద్యం తాగి పాఠశాలకు వెళ్లిన 8వ తరగతి విద్యార్థులు

37చూసినవారు
మద్యం తాగి పాఠశాలకు వెళ్లిన 8వ తరగతి విద్యార్థులు
TG: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. 8వ తరగతి విద్యార్థులు మద్యం సేవించి పాఠశాలకు వచ్చారు. వారి బ్యాగులను తనిఖీ చేయగా మద్యం సీసాలు బయటపడ్డాయి. పాఠశాల సమీపంలోని బెల్ట్ షాపుల నుండి మద్యం కొనుగోలు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ ఘటనతో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్