విమానం సీట్ల కింద 9 కోట్ల బంగారం.. 8 మంది స్మగ్లర్లు అరెస్ట్

5320చూసినవారు
విమానం సీట్ల కింద 9 కోట్ల బంగారం.. 8 మంది స్మగ్లర్లు అరెస్ట్
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో సుమారు 6.5 కిలోల బంగారాన్ని (విలువ దాదాపు రూ.9 కోట్లు) సీట్ల కింద దాచి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఒక మహిళతో సహా 8 మంది అనుమానిత స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరు ఎగ్జిబిషన్ వ్యాపారం పేరుతో దుబాయ్ వెళ్లి, బంగారాన్ని చైన్ల రూపంలో మార్చి, సీట్ల కింద దాచి అక్రమ రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది. అరెస్టయిన 8 మందిని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఈ ముఠాపై దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్