బస్సు ప్రమాదంలో 9 మంది మృతి.. వెలుగులోకి సంచలన విషయాలు

6చూసినవారు
బస్సు ప్రమాదంలో 9 మంది మృతి.. వెలుగులోకి సంచలన విషయాలు
యూపీలోని నోయిడా వద్ద జరిగిన ఘోర ప్రైవేట్ బస్సు ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రైవర్, క్లీనర్ల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రయాణ సమయంలో బస్సులో పొగ, కాలిన వాసన రావడం గమనించి వారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని మండిపడ్డారు. అంతేకాకుండా, క్యాబిన్‌లో డ్రైవర్, క్లీనర్ సిగరెట్ తాగినట్లు ప్రయాణికులు తెలిపారు. వారి బాధ్యతారాహిత్యం వల్లే మంటలు చెలరేగి 9 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్