జైలులో ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెల్‌ఫోన్‌లో 90 నీలి చిత్రాలు!

18389చూసినవారు
జైలులో ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెల్‌ఫోన్‌లో 90 నీలి చిత్రాలు!
లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జనతాదళ్ (సెక్యులర్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన బ్యారక్ నుండి డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు ఉన్న మొబైల్ ఫోన్‌ను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖైదీల వద్ద సెల్‌ఫోన్లు ఉన్నాయనే సమాచారం మేరకు కర్ణాటక హోమంత్రి ఆదేశాల మేరకు సెంట్రల్ క్రైం బ్రాంచ్ అధికారులు జైలులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రజ్వల్ బ్యారక్‌తో సహా మొత్తం 10 సెల్‌ఫోన్లు, ఒక పెన్ డ్రైవ్, ఛార్జర్ దొరికాయి. మొబైల్‌లో సుమారు 80-90 అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్