TG: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఒక ఇంటి నంబర్ పై 92 ఓట్లకు పైగా ఉండగా.. మరో వార్డులో ఒకే ఇంటి నంబర్ పై 20కి పైగా ఓట్లు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఇటీవల అధికారులు ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేశారు. ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. జాబితాలను పరిశీలిస్తే.. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 6వ వార్డులోని 3-133 ఇంటి నంబర్స్ తో పాటు.. అదే ఇంటికి బై నంబర్లతో సుమారు 92 ఓట్లు ఉన్నాయి. 9వ వార్డులో సైతం 4-223 ఇంటి నంబర్ పై 20 ఓట్ల వరకు నమోదవటం చర్చనీయాంశం అవుతోంది.