ఈఎస్‌ఐసీ ఫరీదాబాద్‌లో 94 సీనియర్ రెసిడెంట్‌ ఖాళీలు

103చూసినవారు
ఈఎస్‌ఐసీ ఫరీదాబాద్‌లో 94 సీనియర్ రెసిడెంట్‌ ఖాళీలు
ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ESIC) చండీగఢ్‌, ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్‌ (బ్రాడ్‌ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్‌) ఖాళీల భర్తీకి నవంబర్ 7వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, చెస్ట్‌, డెర్మటాలజీ, మెడిసిన్‌, ఒబెస్ట్రిక్స్‌ అండ్ గైనకాలజీ, ఆర్థోపెడిక్స్‌, పీడీయాట్రిక్స్‌, రేడియాలజీ, సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, ఫారెన్సిక్‌ మెడిసిన్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు https://esic.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.