ప్రపంచంలోని 100 వేడి నగరాల్లో 95 భారత్‌లోనే!

55చూసినవారు
ప్రపంచంలోని 100 వేడి నగరాల్లో 95 భారత్‌లోనే!
దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత భయపెడుతోంది. తాజా గ్లోబల్ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని అత్యంత వేడి 100 నగరాల్లో ఏకంగా 95 నగరాలు భారతదేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మధ్య భారతం నుంచి ఇండో-గంగా మైదానాల వరకు పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40–45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. బింద్కీ, ఫతేపూర్, ఇటావా వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరాయి. రాబోయే రోజుల్లో కూడా ఎండల తీవ్రత కొనసాగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్