TG: గద్వాల్ జిల్లా కేటీదొడ్డి మండలం యర్సన్ దొడ్డి గ్రామంలో విషాదం నెలకొంది. మల్లేష్(16) అనే బాలుడు పొలం నుంచి ఇంటికి వస్తుండగా వర్షానికి చెట్టు కిందకు వెళ్లాడు. ఇదే సమయంలో పిడుగు పడటంతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.