బార్‌లో రచ్చ.. అడ్డుకున్న కానిస్టేబుల్‌ చేతిని కొరికిన వ్యక్తి (వీడియో)

7893చూసినవారు
కర్ణాటకలోని కోలార్ జిల్లా ముల్బాగల్ తాలూకా ఎన్.చామకలహళ్లిలోని బార్ అండ్ రెస్టారెంట్‌లో మోహన్ రెడ్డి, గౌతమ్ మద్యం సేవించి గొడవకు దిగారు. క్యాషియర్‌తో వాగ్వాదం తర్వాత నంగలి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ నారాయణస్వామి కుడిచేతిని మోహన్ రెడ్డి కొరికినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. పోలీసులు కేసు నమోదు చేసి మోహన్ రెడ్డి, గౌతమ్‌లను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్