మండుతున్న అగ్ని పర్వతం పక్కనే మండుతున్న ఉల్క (వీడియో)

10చూసినవారు
ఫిలిప్పీన్స్‌లోని లుజోన్ ద్వీపంలో మే 25న రాత్రి మాయోన్ అగ్నిపర్వతం పక్కనే ఒక అరుదైన 'ఫైర్ బాల్' ఉల్క ఆకాశంలో మెరిసింది. లావా ప్రవాహంతో అగ్నిపర్వతం మండుతుండగా, ఆకాశం నుంచి దూసుకొచ్చిన ఈ ఉల్క పచ్చటి కాంతితో ప్రకాశిస్తూ అగ్నిపర్వతం వెనుకగా కనుమరుగైంది. ఉల్క అగ్నిపర్వతాన్ని ఢీకొట్టినట్లు కనిపించినా, అది వాతావరణంలోనే విచ్ఛిన్నమై కాలిపోయిందని అధికారులు స్పష్టం చేశారు. ఈ అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.