AP: గుంటూరు జిల్లా మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ర్యాష్ డ్రైవింగ్‌తో కారు బైక్‌ను ఢీ కొట్టడంతో మూడేళ్ల చిన్నారి విరోనిక అక్కడికక్కడే మృతి చెందింది. కారును ఒక వైద్య విద్యార్థిని నడుపుతున్నట్లు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని, కారు నడిపిన వైద్య విద్యార్థినిని అదుపులోకి తీసుకోవాలని మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.