ఇరాక్‌లోని కిర్కుక్ నగరంలో ఒక డ్రైవర్ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత బిల్లు చెల్లించకుండానే కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఆ సమయంలో ఫ్యూయల్ పైప్ ఇంకా ట్యాంక్‌లోనే ఉండటంతో.. అది బలంగా కింద పడి అక్కడే ఉన్న పెట్రోల్ బంక్ సిబ్బందికి తగిలింది. దీంతో ఆ సిబ్బంది గాల్లోకి ఎగిరి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ (CCTV) దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.